Friday, February 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రశాంతంగా ఇంటర్ ప్రథమ సంవత్సరం ఇంగ్లీష్ పరీక్ష..

ప్రశాంతంగా ఇంటర్ ప్రథమ సంవత్సరం ఇంగ్లీష్ పరీక్ష..

- Advertisement -

నవతెలంగాణ- తుంగతుర్తి
ఇంట‌ర్ వార్షిక ప‌రీక్ష‌లు శుక్రవారం( ఇంగ్లీష్ పేప‌ర్-1)ప్ర‌శాంతంగా ముగిసిన‌ట్లు ఆయా కేంద్రాల సి ఎస్,డి ఓ లు  వెల్ల‌డించారు.శుక్రవారం జ‌రిగిన ప‌రీక్ష‌కు తుంగతుర్తి మండల వ్యాప్తంగా 470 మంది విద్యార్థులు హాజ‌రు కావాల్సి ఉండ‌గా,452 మంది హాజ‌ర‌య్యారు.18 మంది విద్యార్థులు హాజ‌రు కాలేదు.తుంగతుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి 236 మంది విద్యార్థులకు 234హాజరు కాక 2 విద్యార్థులు ఆబ్సెంట్ అయినట్లు తెలిపారు,గిరిజన బాలికల కళాశాల నుండి 234 మంది విద్యార్థులకు గాను 218 మంది విద్యార్థులు హాజరు కాక 16 విద్యార్థులు ఆబ్సెంట్ అయినట్లు తెలిపారు.11 గంటలకు పరీక్ష కేంద్రాలను ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందం తనిఖీ చేసినట్లు తెలిపారు.పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సి ఎస్ లు మధుకర్,అరుణ డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు ఉపేందర్,నరేందర్ లు తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -