Friday, February 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని ఎంపీడీవోకు వినతి

పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని ఎంపీడీవోకు వినతి

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ ఉమ్మడి మండలంలోని మద్నూర్ డోంగ్లి మండలాల పరిధిలోని మాజీ సర్పంచులు శుక్రవారం మద్నూర్ మండల అభివృద్ధి కార్యాలయానికి తరలివచ్చి పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఎంపీడీవో కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచులు మాట్లాడుతూ.. గతంలో గ్రామాల్లో మౌలిక సదుపాయాల కోసం పలు రకాల అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. వాటికి సంబంధించిన పెండింగ్ బిల్లులు వెంటనే మంజూరు చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఎంపీడీవో అందుబాటులో లేకపోవడంతో ఎంపిఓ వెంకట నరసయ్యకు వినత్పత్రాన్ని మాజీ సర్పంచ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో సురేష్ ,సంతోష్, సూర్యకాంత్, ఎం కే పటేల్, షేక్ గఫర్, రాజ్ కుమార్, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -