Friday, February 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వీబీజీ రామ్ జీ బిల్లును రద్దు చేయాలి

వీబీజీ రామ్ జీ బిల్లును రద్దు చేయాలి

- Advertisement -

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలి
కార్మిక సంఘం అమ్రాబాద్ మండల సభ ఏకగ్రీవ తీర్మానం
నవతెలంగాణ – అచ్చంపేట
వీబీజీ రామ్ జి బిల్లును రద్దు చేయాలని, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలని  వ్యవసాయ కార్మిక సంఘం అమ్రాబాద్ మండల సభ శుక్రవారం  ఏకగ్రీవ తీర్మానం చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం ప్రతినిధుల సభ కు ఎస్ మల్లేష్ అధ్యక్షత వహించారు.  మహాత్మా గాంధీజాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలని ప్రతి గ్రామపంచాయతీ తీర్మానం ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని సమావేశం తీర్మానించింది. 

నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నిక 
అధ్యక్షులుగా వెన్నెల, ప్రధాన కార్యదర్శిగా బాలయ్య, ఉపాధ్యక్షులుగా భాగ్యమ్మ, జంగమ్మ, సాయిలు, సహాయ కార్యదర్శులుగా రాములు, జగన్, కృష్ణయ్య, కోశాధికారి గా నాసరమ్మ, కమిటీ సభ్యులుగా బాలకృష్ణయ్య, మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకున్నది. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహిళా కన్వీనర్ కమిటీ కన్వీనర్ బి పద్మ, గో కన్వీనర్లు స్వరూప ,శారద, జిల్లా ప్రధాన కార్యదర్శి పి నరసింహ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -