- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని కాపురం ఓసిపి బ్లాక్-1లో విదులు నిర్వహిస్తున్న ఉద్యోగులు, కార్మికులకు ఏఎమ్మార్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు ఏఎమ్మార్ వైద్యాధికారి శ్రీకాంత్, హెచ్ఆర్ డీజీఎం రమేష్ బాబు ఆధ్వర్యంలో శుక్రవారం కరీంనగర్ ఫార్చ్యూన్ మెడ్ కేర్ ఆసుపత్రి గుండె వైద్య నిపుణులచే వైద్య పరీక్షలు చేయించారు. ఇందుకు ఉద్యోగులు,కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఫార్చ్యూన్ మెడ్ కేర్ క్యాంపు ఇన్చార్జి గజవెల్లి గణేష్, సిఎస్ఆర్ సూపర్వైజర్ బొబ్బిలి నరేష్ గౌడ్, నారమల్ల నవీన్, ఏఎమ్మార్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



