ఇప్పటి వరకు 60 శాతమే నమోదు
నవతెలంగాణ – మల్హర్ రావు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫార్మర్ రిజిస్ట్రీకి ఈ నెలాఖరు వరకు గడువు విధించారు.ఇంకా ఈ ప్రక్రియ పూర్తికి ఒక్క రోజే మిగిలి ఉంది. మండలంలో ఏడాదిగా ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ కొనసాగుతున్నా నత్తనడకన సాగుతోంది. మండల ఇప్పటి వరకు 60 శాతం ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తయింది.శనివారం ఒక్కరోజు వందశాతం నమోదుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.మండలంలో మొత్తం రైతులు 9,838 ఉండగా ఇప్పటికి 6,382 పూర్తియి,ఇంకా 3,457 చేయాల్సి ఉంది.ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు ప్రక్రియ వ్యవసాయశాఖకు అప్పగించినప్పటికి అనేక పని ఒత్తిడి, రైతుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో నమోదు ప్రక్రియ ఆలస్యమైంది.
ఈ ప్రక్రియను వేగవంతం చేసుందుకు ప్రభుత్వం మీ సేవ కేంద్రాల్లో సైతం నమోదుకు అవకాశం ఇచ్చింది. అయినా రైతులు ఆసక్తి చూపడం లేదు. దీంతో ప్రభుత్వం ఇటీవల గ్రామాల్లో అధికారులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ, రైతులందరితో ఫార్మర్ రిజిస్ట్రీపై అవగాహన కల్పిస్తూ నమోదు ప్రక్రియ కొనసాగిస్తోంది. గ్రామాలకు ప్రత్యేకంగా టైంటేబుల్ ఇచ్చి ముందు రోజు గ్రామంలో దండోరా చేయించి గ్రామ పంచాయతీ కార్యాలయంలో వ్యవసాయ శాఖ, రెవెన్యూ, గ్రామ పంచాయతీ రాజ్, సహకార సంఘాల సిబ్బంది వచ్చి ఫార్మర్ రిజిస్ట్రీ చేస్తున్న మండలంలో ఇంకా పూర్తి కాలేదు. శనివారం ఒక్కరోజులో 3457 మంది రైతులు నమోదు చేసుకునేనా.? ప్రభుత్వం గడువు పెంచితేనే సాధ్యమవుతుంది. లేదంటే నమోదు చేసుకొని రైతులు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు దూరమవడం ఖాయం.



