Saturday, February 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రెవెన్యూ శాఖలో అక్రమాలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే

రెవెన్యూ శాఖలో అక్రమాలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే

- Advertisement -

డిసీసి ప్రధాన కార్యదర్శి మీసం నాగరాజ్ యాదవ్ 
నవతెలంగాణ – చిన్నకోడూరు

బీఆర్ఎస్ పాలనలోనే రెవెన్యూ వ్యవస్థలో భారీగా అవినీతి, అక్రమాలు జరిగాయని డీసీసీ ప్రధాన కార్యదర్శి మీసం నాగరాజు యాదవ్ ఆరోపించారు. శుక్రవారం  మాట్లాడుతూ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎమ్మెల్యే హరీశ్ రావు ఏనాడు తహశీల్దార్ కార్యాలయాలను తనిఖీ చేయలేదని, అధికారం పోయాక తనిఖీలు చేపట్టడం సిగ్గు చేటన్నారు. సాదా బైనామా దరఖాస్తులు బీఆర్ఎస్ పాలనలోనే పెండింగ్లో ఉన్నాయన్నారు. ధరణీ పేరుతో కెసిఆర్ కుటుంబం , బీఆర్ఎస్ నేతలు పేదల భూములు లాక్కొని ,కోట్ల రూపాయల అవినీతి చేశారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణి అక్రమాలను సరి చేసి భూభారతిగా అమలు చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నేరవేరుస్తుందన్నారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు నాయకులు యూత్ కాంగ్రేస్ అసెంబ్లీ మాజీ కార్యదర్శి కల్లూరి నర్సింలు ,నాయకులూ కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి మహేందర్ రెడ్డి ,కోరిమి రాజు ,ఒగ్గు కిసాన్,సురేష్,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -