నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని ఉప్లూర్ గ్రామంలో శుక్రవారం నిరుపేద కుటుంబానికి చెందిన అలకుంట లక్ష్మి రమేష్ దంపతులు నూతన ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశం చేశారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథి గ్రామ సర్పంచ్ ఎనుగందుల శైలేందర్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి, రిబ్బన్ కట్ చేసి చేశారు.అలకుంట లక్ష్మి రమేష్ దంపతులతో గృహప్రవేశం చేయించి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ ఏనుగుందుల శైలెందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిరుపేదలకు ఇల్లు కట్టించి వారి కళ్ళలో ఆనందం చూడాలని,స్వంత ఇంటి కళ నిజం చేయాలని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల గృహ నిర్మాణ పథకం చేపట్టిందన్నారు. ఈ పథకం విజయవంతంగా ముందుకు సాగుతోందనీ, రానున్న రోజుల్లో అర్హులైన ప్రతిఒక్కరికి బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ ముత్యలా సునీల్ రెడ్డి సహకారంతో ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు. నూతన గృహ ప్రవేశం చేసిన అలకుంట లక్ష్మి రమేష్ దంపతులకు హార్థిక శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ తక్కురి శేఖర్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్ముల రవీందర్, ఎనడ్ల గంగారెడ్డి, అవారి సత్యం, వార్డ్ మెంబర్ షాదుల్లా, సుంకరి విజయ్, బద్దం తిరుపతి రెడ్డి, మరుపాక నరేష్, తదితరులు పాల్గొన్నారు.



