నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
యాదాద్రి భువనగిరి జిల్లా కు నూతనంగా విచ్చేసిన కలెక్టర్ 2015 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అనురాగ్ జయంతి ని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం లో మర్యాదపూర్వకంగా కలిసి షాలువాతో సన్మాణించారు. ఈ సందర్బంగా ఎంపీ చామల కలెక్టర్ తో జిల్లా కు సంబందించిన ప్రధాన అంశాలపై చర్చించారు. ముఖ్యంగా బస్వాపూర్ రిజర్వయర్ ప్రాజెక్ట్ స్థితిగాతులను కలెక్టర్ కు వివరించారు. ఏం ఏం టి ఎస్ రైలు ఘట్కేసర్ నుండి వంగపల్లి వరకు మొత్తం కొత్త లైన్ 412 కోట్ల తో పూర్తి బడ్జెట్ కేంద్రం బరిస్తూ పనులు మొదలుపెట్టడం జరిగిందని, దీని కొరకు పార్లమెంట్ లో తానే స్వయంగా కొట్లాడడం జరిగిందని కలెక్టర్ కు తెలిపారు. జిల్లాలోని మదర్ డైరీ పాల ఉత్పత్తిదారుల సమస్యలపై చర్చించారు.యాదాద్రి దేవస్థానం యొక్క విశిష్టతపై మాట్లాడుకున్నారు.ఈ కార్యక్రమం లో రెవిన్యూ అడిషనల్ కలెక్టర్ వెంకారెడ్డి, మున్సిపల్ చైర్మన్ తాంగేళ్లపల్లి శ్రీవాణి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పోత్నాక్ ప్రమోద్ కుమార్, తంగెల్లపల్లి రవి కుమార్, బర్రె జహంగీర్, మహమ్మద్ అతహర్ పాల్గొన్నారు.
నూతన కలెక్టర్ ను మార్యాదపూర్వకంగా కలిసిన ఎంపీ చామల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



