- Advertisement -
నవతెలంగాణ – ముధోల్
ముధోల్ మండలంలోని చించాల గ్రామంలో శుక్రవారం రాత్రి దోమల నివారణ కు సర్పంచ్ దొడ్డి కింది సర్వేష్ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. గ్రామంలోని ఆయా గల్లీలో ఫాగింగ్ తో దోమల నివారణ చర్యలు తీసుకున్నారు. దోమలు ఉన్న ప్రాంతాలను గుర్తించి నివారణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని సర్పంచ్ తెలిపారు. ప్రతి ఒక్కరు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. మురికి నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని సర్పంచ్ చెప్పారు.
- Advertisement -



