- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని జక్రాన్ పల్లి మండలంలోని అర్గుల్ గ్రామానికి చెందిన నాగుపల్లి గంగారాం (70) అనే వ్యక్తి శుక్రవారం మృతి చెందాడు. పట్టణంలో పనులు ముగించుకొని తిరిగి అర్గుల్ వెళుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టగా అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుపోలీసులు తెలిపారు.
- Advertisement -



