బిగ్ బాస్ 8 విన్నర్ నిఖిల్ మాలియక్కల్ హీరోగా తెరకెక్కిన ‘విక్రమ్ ఆన్ డ్యూటీ’ వెబ్ సిరీస్ జియో హాట్ స్టార్‌లో రాబోతోంది.
ఈ నేపథ్యంలో టీమ్ రిలీజ్ చేసిన ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అన్ని రకాల అంశాలను జోడించి ఈ సిరీస్‌ను తెరకెక్కించినట్టుగా ప్రోమోను చూస్తే తెలుస్తోంది. నిఖిల్ మాలియాక్కల్ ఈ సిరీస్‌లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా పవర్‌ఫుల్‌లో కనిపించ బోతున్నారు. ఇక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ యాక్షన్‌తో ఆయన అలరించనున్నారు.
ఓ వైపు సీరియస్‌గా కేసు గురించి చెబుతూ ఉండటం.. మరో వైపు ఆటో వాడితో బేరం ఆడుతూ విక్రమ్ పాత్రలో నిఖిల్ ఎంట్రీ ఇవ్వడం.. అందరిలోనూ ఆసక్తిరేకెత్తిస్తోంది. రకరకాల నేరాలు, వాటిని ఇన్వెస్టిగేషన్ చేయడం లాంటి ఇంట్రెస్టింగ్ సీన్లతో ప్రోమోను కట్ చేశారు. ఇక ఈ ప్రోమోని చూస్తే సిరీస్‌ను వెంటనే చూసేయాలనే ఉత్సుకతో ఆడియెన్స్‌లో కలిగేలా ఉంది.
మరి ఆ నేరాల్ని ఎవరు చేశారు?, వాటి వెనుకున్న రహస్యాలు ఏంటి? ఎవ్వరూ పట్టించుకోని చిన్న చిన్న ఆధారాలతో విక్రమ్ కేస్‌ని ఎలా పరిష్కరిస్తాడు? అన్నదే కథాంశం.
స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌లోని ఓ డిఫరెంట్ స్టైల్‌లో పని చేసే పోలీసు అధికారి విక్రమ్ వాసు పాత్రలో నిఖిల్ చాలా కొత్తగా కనిపించనున్నారు.
ఇక ఈ సిరీస్‌లో అషు రెడ్డి కీలక పాత్రలో నటించారు. మార్చి 6 నుండి జియో హాట్ స్టార్‌లో ఈ సిరీస్ ప్రసారం కానుంది అని చిత్ర యూనిట్ తెలిపింది.
ఆ నేరాలు చేసింది ఎవరు?
- Advertisement -
- Advertisement -



