Saturday, February 28, 2026
E-PAPER
Homeఆటలుసత్తా చాటిన టెన్నిస్‌ ప్లేయర్స్‌

సత్తా చాటిన టెన్నిస్‌ ప్లేయర్స్‌

- Advertisement -

ఆల్‌ ఇండియా మహిళల టోర్నమెంట్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌ :
ఆల్‌ ఇండియా మహిళల టెన్నిస్‌ టోర్నమెంట్‌లో తెలంగాణ అమ్మాయిలు సత్తా చాటారు. హర్యానాలోని పానిపట్‌లో జరిగిన పోటీల్లో సింగిల్స్‌ విభాగంలో హాసిని యాదవ్‌, సంజన శ్రీమల్ల పసిడి, రజత పతకాలు సాధించారు. ఫైనల్లో సంజనపై 7-5, 7-5తో గెలుపొందిన హాసిని టైటిల్‌ సొంతం చేసుకుంది. డబుల్స్‌ విభాగం ఫైనల్లో ఒమ్న, సంజన జంట 6-1, 6-2తో సెల్వి, దేవాన్షి (గుజరాత్‌)పై గెలుపొందారు. మెడల్స్‌ సాధించిన క్రీడాకారిణిలు, కోచ్‌ గురునాథ్‌లను హైదరాబాద్‌ ఓపెన్‌ టెన్నిస్‌ సంఘం అధ్యక్షుడు నంద్యాల నరసింహారెడ్డి అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -