మద్యం పాలసీ కేసులో కోర్టు తీర్పుతో ప్రధాని మోడీ, అమిత్‌షా దేశానికి క్షమాపణ చెప్పాలి
కేజ్రీవాల్‌ను అవినీతిపరుడిగా ముద్రవేసేలా ఆర్ఎస్ఎస్, బీజేపీ కుట్ర
కేరళలో సీఎం పినరయి విజయన్ నాయకత్వంలో ఎన్నికలకు లెప్ట్‌ఫ్రంట్
ఆ రాష్ట్రంలో ప్రయివేటురంగాన్ని కట్టడిచేశాం
ప్రభుత్వరంగంలో విజయాలు కేంద్రానికి మింగుడుపడట్లేదు
కేరళ ఆరోగ్యమంత్రిపై కేఎస్‌యూ గూండాల దాడి దుర్మార్గం : సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి ప్రతిపక్ష నాయకులను వేటాడుతున్న బీజేపీ ప్రభుత్వానికి కోర్టు తీర్పు చెంపపెట్టు అని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ అన్నారు. ప్రధానమంత్రి మోడీ, హోంమంత్రి అమిత్ షా దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారంనాడిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మద్యం కేసులో అరవింద్ కేజ్రీవాల్ సహా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ కవిత తదితరులను నిర్దోషులుగా ప్రకటించిన కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పారు. బెదిరింపులకు లొంగకుండా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడే ధైర్యాన్ని ప్రదర్శించాలని కోర్టు కోరు కుందని వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్‌ను అవి నీతిపరుడిగా చిత్రీకరించాలనే దురుద్దేశంతో ఈ కేసును రూపొందిం చారని, ఆప్ ముఖ్య లక్షణం అవినీతి వ్యతిరేకత అని తెలిపారు. ఈ కేసుతో దానిని నాశనం చేయడానికి ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రయత్నిం చాయనీ, వారి దురుద్దేశపూరిత ప్రణాళి కకు కాంగ్రెస్ కూడా మద్దతు ఇస్తూ, ఎన్నికల సమ యంలో కేజ్రీవాల్‌పై తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేశారని విమర్శించారు. ఆరోపణలు నిరాధారమని కోర్టు పేర్కొందని, దర్యాప్తు సంస్థపై చర్య తీసుకోవాలని కూడా ఆదేశించిందని గుర్తుచేశారు.
సీఎం పినరయి విజయన్ నేతృత్వం
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్ ఫ్రంట్‌కు సీఎం పినరయి విజయన్ నాయకత్వం వహిస్తారని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ తెలిపారు. ‘ముఖ్యమంత్రి పదవికి ఎవరినైనా నిలబెట్టే పద్ధతి సీపీఐ(ఎం) లో లేదు. సాధారణంగా ఎన్నికల్లో గెలిచిన తరువాత ముఖ్య మంత్రిని నిర్ణయిస్తారు. ముఖ్యమంత్రి నాయ కత్వంలో ఎన్నికలకు వెళ్తాం’ అని చెప్పారు. మార్చి మొదటి వారంలో అభ్యర్థులను నిర్ణయిస్తా మన్నారు. పొలిట్‌బ్యూరో సభ్యులు, కేంద్ర కమిటీ సభ్యులు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా? అనే దానితో సహా అభ్యర్థులు ఎవరు అనేది పూర్తిగా ప్రజాస్వామ్య పద్ధతిలో సీపీఐ(ఎం) నిర్ణయిస్తుందని తెలిపారు. మరికొన్ని పార్టీల్లో అదృశ్య హైకమాండ్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుందనీ, సీపీఐ(ఎం)లో మాత్రం జిల్లా, రాష్ట్ర స్థాయిలో చర్చలు జరిపిన తరువాతే అభ్యర్థులను నిర్ణయిస్తారని వివరించారు. సీపీఐ(ఎం) యువత, మహిళలు, సామాజికంగా వెనుక బడిన వర్గాల అభ్యర్థులను బరిలోకి దింపుతుందని తెలిపారు. అభ్యర్థుల గెలుపు అవకాశాలను కూడా పరిగణనలోకి తీసుకుం టామన్నారు. ‘అభ్యర్థులను నిర్ణయించడంలో పార్టీకి కొన్ని సాధారణ ప్రమాణాలు ఉన్నాయి. వాటిలో వారు ఎన్నిసార్లు పోటీ చేయవచ్చో కూడా ఉంది. అవ సరమైతే ప్రమాణాల్లో సడలింపులు చేయవచ్చు. ఈ విషయంలో, ప్రధా నంగా పరిగణించాల్సిన విషయం విజయావకాశమే’ అని స్పష్టంచేశారు.
బీజేపీ సర్కార్‌కు చెంపపెట్టు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



