-100 రోజులు గడిచినా మిషన్ లేదు..
-డబ్బులు వాపసు చేయడంలేదు
-సుమారు 50 నుండి 70 మంది వద్ద వసూళ్ల ఆరోపణలు
నవతెలంగాణ-రాయికల్: జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని మహితాపూర్ గ్రామంలో కుట్టు మిషన్ ఇప్పిస్తామని చెప్పి ఒక్కొక్కరితో వెయ్యి రూపాయలు వసూలు చేసిన ఘటన కలకలం రేపుతోంది.‘ఐ క్యు మైండ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ’ పేరుతో రసీదులు ఇస్తూ 100 రోజుల్లో మిషన్ అందజేస్తామని,లేకపోతే డబ్బులు తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చినట్లు బాధితులు తెలిపారు.అయితే 100 రోజులు పూర్తయ్యినా కుట్టు మిషన్లు ఇవ్వకపోవడంతో పాటు డబ్బులు కూడా వాపసు చేయడం లేదని ఆరోపిస్తున్నారు.సంబంధిత రసీదు ఇచ్చినవారి ఫోన్ నంబర్‌కు సంప్రదిస్తే మిషన్ కావాలంటే మరో నాలుగు నెలలు వేచి చూడాలని,డబ్బులు కావాలంటే పేర్లు నమోదు చేసుకుంటున్నామని సమాధానం ఇస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు.గ్రామంలో సుమారు 50 నుంచి 70 మంది వరకు వెయ్యి రూపాయలు చొప్పున వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.బాధితుల కోరిక మేరకు రసీదులపై ఉన్న వారి వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచడం జరిగింది.ఈ వ్యవహారంపై అధికారులు స్పందించి విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
కుట్టు మిషన్ పేరిట వసూళ్లు..!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



