పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి
నవతెలంగాణ – ఆలేరు టౌను
అభివృద్ధిని అడ్డుకోవడమే బిఆర్ఎస్ నాయకుల హరీష్ రావు పనిగా పెట్టుకున్నారని, భువనగిరి పార్లమెంట్ సభ్యులు, చామల్ కిరణ్ కుమార్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. హరీష్ రావు ఆరు అడుగులు పెరిగాడు , కానీ కాసంత దిమాక్ లేదని పేర్కొన్నారు. విశాఖ శారద పీఠం కు నియో పోలిస్ లో ఒక రూపాయి కి ఎకరం చొప్పున రెండు ఎకరాలు కేటాయించారని, శారద పీఠం కు ఇదే రెండు ఎకరాలు శంషాబాద్ లో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వివరించారు.
శారదా పీఠం వారితో అధికారులు చర్చలు జరిపారని, శారదా పీఠం ఒప్పుకున్నాకే భూమి తీసుకునేందుకు నిర్ణయం తీసుకున్నామాని, శారదా పీఠం ఉన్న భూమిని, హైదరాబాద్ వాటర్ వర్క్స్ కోసం కేటాయించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని, హైదరాబాద్ తాగు నీటి అవసరం కోసం నియోపోలిస్ లో రిజర్వాయర్ అవసరమాని తెలియజేశారు. మేడారం జాతర ను ప్రపంచం గర్వించే లా చేసమాని, గోదావరి పుష్కరాలను ఇదే విదంగా నిర్వహిస్తామన్నారు. అభివృద్ధి ని అడ్డుకోవడమే హరీష్ రావు ఎజెండా గా పెట్టుకున్నారని, సబర్మతి నదీ ప్రక్షాళన లో ఎంత మంది ని అక్కడ నుంచి తరలించారో రాంచందర్ రావు కు తెలియదా అని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు అభివృద్ధి కావాలి, తెలంగాణ అభివృద్ధి కావొద్దా అని, బిఆర్ఎస్ మాట్లాడిందే, బీజేపీ మాట్లాడుతుందని విమర్శించారు.
అభివృద్ధిని అడ్డుకోవడమే హరీష్ పనిగా పెట్టుకున్నారు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



