నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని పెద్ద ఏడ్గి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాన్సువాడ ఆర్డిఓ కిరణ్మయి శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థిని, విద్యార్థుల గురించి పదవ తరగతి సంబంధించిన విద్యాబోధన అంశాలను చర్చించారు. మధ్యాహ్న భోజన పథకం అమలుతీరు, 10వ తరగతి కి సంబంధించిన అన్ని సబ్జెక్టుల బోధన పూర్తి అయిందా ? రివిజన్ చేశారా? ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారా? సాయంత్రం ట్యూషన్ చెప్తున్నారా? స్నాక్స్ ఇస్తున్నారా? పలం విషయాలను విద్యార్థిని, విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం విద్యార్థిని విద్యార్థులతో కలిసి గ్రామ సర్పంచ్ అనిల్ కుమార్ మరియు రెవెన్యూ శాఖ అధికారులతో సహపంక్తి భోజనాలు చేశారు. విద్యార్థులకు రుచికరమైన ఆహారం అందించాలని మధ్యాహ్నం భోజనం పథకం నిర్వాహకులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ తో పాటు గ్రామ సర్పంచ్ అస్పత్ వార్ అనిల్ కుమార్ , జుక్కల్ ఎమ్మార్వో మారుతి , డిప్యూటీ ఎమ్మార్వో హేమలత , ఆర్ఐ రామ్ పటేల్ , ఎమ్ఈఓ తిరుపతయ్యా , ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.



