నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండల కేంద్రంలోని 9వ వార్డులో మార్కండేయ మందిర్ దగ్గర గల విద్యుత్తు స్థంభం ప్రమాదరకంగా ఉంది. ట్రాన్స్ ఫార్మర్ రోడ్డు పక్కనే ఉండడంతో అటుగా వెళ్ళే కాలనీ వాసులు భయంతో జంకుతున్నారు. సమస్య గురించి విద్యుత్ అధికారులకు స్థానికులు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకునే నాథుడే కరువయ్యారని వాపోతున్నారు. వెంటనే విద్యుత్ నియంత్రికను మరికొంత ఎత్తులో పెట్టాలని 9వ వార్డు సభ్యులు, కాలనీవాసులు కోరుకుంటున్నారు. అదేవిధంగా శిథిలమై ప్రమాదకరంగా మారిన విద్యుత్ స్తంభం తొలగించి కొత్త స్తంభాన్ని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాలనీవాసులకు ఏ అపాయము కాకముందే వెంటనే సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు విన్నవించారు.
ప్రమాదకరంగా విద్యుత్ స్థంభం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



