Saturday, February 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విభిన్న రంగాలలోకి వెళ్తే ఉపాధి అవకాశాలు

విభిన్న రంగాలలోకి వెళ్తే ఉపాధి అవకాశాలు

- Advertisement -

– పసుపు పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ విద్య
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
విద్యార్థులు ఒకే రంగాన్ని ఎంచుకోకుండా విభిన్న రంగాల్లోకి వెళితే ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని స్థానిక పసుపు పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ విద్య అన్నారు. శనివారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో నిర్వహించిన జాతీయ సైన్స్ దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాస్త్రవేత్త డాక్టర్ విద్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  సైన్స్ అభివృద్ధి చెందుతున్న తరుణంలో అందరూ ఒకే వైపు ఒకే రంగాన్ని ఎంచుకోకుండా, విభిన్నంగా ఆలోచించి విభిన్న రంగాలలోకి వెళ్తే ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు. ఎక్కడా ఎక్కువ అవకాశాలు ఉంటాయో ఆ వైపు అడుగులు వేయాలని, విద్యార్థినిలు మహిళా శాస్త్రవేత్తలుగా ఎదగాలని సూచించారు.

పెద్ద కలలు కనాలని, అవి నెరవేరెందుకు నిరంతరం శ్రమించి ప్రయత్నం చేయాలని తెలియజేశారు.థింక్ బిగ్ అండ్ డూ హార్డ్  వర్క్ అని విద్యార్థినిలకు వివరించారు. అనంతరం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ప్రత్యేక అధికారిని గంగామణి మాట్లాడుతూ అభివృద్ధి చెందిన భారతదేశం కోసం వికసిత భారత్ 2047 లక్ష్య సాధనలో మహిళా శాస్త్రవేత్తలు కీలక పాత్రను పోషించాలన్నారు. 2026వ సంవత్సరంలో విజ్ఞానంలో మహిళలు వికసిత భారత్ కువేగవంతం అనే టీంను సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రారంభించిందని తెలిపారు. మహిళలు అన్ని రంగాలలో ముందుండాలన్నారు.

ఈ జాతీయ సైన్స్ దినోత్సవం కార్యక్రమంలో ముఖ్యంగా సమీకృత వ్యవసాయం, రక్త గ్రూపు వర్గాలు, పంచగవ్య తయారీ, సేంద్రియ పద్ధతులు, రంగవల్లులతో మానవుని వ్యవస్థను తీర్చిదిద్దడం, సౌర వ్యవస్థ, రాత్రి పగలు ఏర్పడటం, ఆమ్లాల క్షారల పరీక్ష ఎంతగానో ఆకట్టుకున్నాయి.వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొన్న ఉపాధ్యాయులకు, జన విజ్ఞాన వేదికలో పాల్గొన్న విద్యార్థినిలకు శాస్త్రవేత్త డాక్టర్ దివ్య చేతుల మీదుగా సర్టిఫికెట్స్ అందజేశారు. జాతీయ సైన్స్ డే ను పురస్కరించుకొని మహిళా శాస్త్రవేత్త డాక్టర్ దివ్యను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, వ్యవసాయ విస్తీర్ణ అధికారి మాధవ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -