- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలోని మోషన్ పూర్ లో శనివారం పౌరహక్కుల పై తహసిల్దార్ ఉమా లత అవగాహన సదస్సును నిర్వహించారు. శనివారం ఆమె మాట్లాడుతూ… భారత రాజ్యాంగం పౌరులకు హక్కులను కల్పించిందని, వాటిని వినియోగించుకోవాలని వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ జార లక్ష్మీ రాజయ్య, ఆర్ఐ రవికాంత్, పంచాయతీ కార్యదర్శి స్రవంతి, జిపిఓ, ఉప సర్పంచ్, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



