Saturday, February 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొంపల్లి గ్రామ అభివృద్ధి మా ప్రధాన లక్ష్యం..

కొంపల్లి గ్రామ అభివృద్ధి మా ప్రధాన లక్ష్యం..

- Advertisement -

భువనగిరి ఎంపీ చామలను కలిసిన వెదిరే బ్రదర్స్..
గ్రామ అభివృద్ధికి రూ.10 లక్షల నిధులను మంజూరు చేసిన భువనగిరి ఎంపీ.
నవతెలంగాణ- మునుగోడు

కొంపల్లి గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి మునుగోడు మండలంలోని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనే మా ప్రధాన లక్ష్యం అని వెదరే పూలమ్మ ఫౌండేషన్ చైర్మన్ వెదరే మేఘా రెడ్డి , కొంపెల్లి గ్రామ ఉప సర్పంచ్ వేదిరే విజేందర్ రెడ్డి అన్నారు. శనివారం భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డిని హైదరాబాదులోని తమ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.

అనంతరం గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరడంతో, తక్షణమే స్పందించి తమ ప్రత్యేక నిధుల నుండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ , సిసి రోడ్ల నిర్మాణం కు అధికారులతో మాట్లాడి 10 లక్షల నిధులను మంజూరు చేశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొంపల్లి గ్రామంలో గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్న తమతోపాటు గ్రామ ప్రజలందరూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గ్రామ అభివృద్ధికి 10 లక్షల నిధులు మంజూరు చేసిన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -