Saturday, February 28, 2026
E-PAPER
Homeఖమ్మంషైన్ హైస్కూల్ లో ఘనంగా సైన్స్ వేడుకలు

షైన్ హైస్కూల్ లో ఘనంగా సైన్స్ వేడుకలు

- Advertisement -

విద్యార్థులు శాస్త్రవేత్తలుగా మారి దేశ అభివృద్ధికి పాటుపడాల
వైరా ఏసిపి సాదుల సారంగపాణి
నవతెలంగాణ – బోనకల్ 

విద్యార్థులు శాస్త్రవేత్తలుగా మారి దేశ అభివృద్ధికి పాటుపడాలని వైరా ఏసిపి సాధువుల సారంగపాణి సూచించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం లోని బోనకల్ మండల కేంద్రంలో గల హైస్కూల్లో శనివారం విజ్ఞాన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను ఎసిపి సాదుల సారంగపాణి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కాంగ్రెస్ యువ నాయకులు బిపి నాయక్, బోనకల్ ఎస్సై పొదిలి వెంకన్న హాజరయ్యారు.

1వ తరగతి నుంచి 9 వ తరగతి వరకు విద్యార్థులు వివిధ సైన్స్ ప్రాజెక్ట్స్ తయారు చేసి అందరిని ఆశ్చర్య పరిచారు.వారి ప్రాజెక్ట్స్ గురించి వచ్చిన అతిధులకి విద్యార్థులు వివరించారు. విద్యార్థులు మొత్తం 60 ప్రాజెక్ట్స్ తయారు చేసారు. ఈ సందర్భంగా  సారంగపాణి మాట్లాడుతూ  విద్యార్దులే దేశ ప్రగతికి ముఖ్యం అని, శాస్రవేత్తలుగా మారి దేశ పురోభివృద్ధికి తోడ్పాడాలని సూచించారు. విద్యార్థులు ప్రాథమిక దేశం నుంచే ఉన్నత ప్రమాణాలను పాటిస్తూ చదువులో రాణిస్తూ ముందుకు సాగాలని కోరారు. చదువుకునే సమయంలోనే విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తుకు బాట వేసుకోవాలన్నారు. అలా కాకుండా దొర అలవాట్లకు అలవాటు పడితే జీవితం నాశనం అవుతుందన్నారు.

తల్లిదండ్రులు విద్యార్థులపై ఎన్నో ఆశలు పెట్టుకొని అనేక కష్టాలు పడుతూ చదివిస్తున్నారన్నారు. తల్లిదండ్రులు పడిన కష్టానికి ఫలితం దక్కేలా విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవాలని సూచించారు. ఆ విధంగా కష్టపడి చదువుకుంటే దేశంలోనే అత్యున్నత స్థానంలో పిలుస్తారన్నారు. బిపి నాయక్ మాట్లాడుతూ.. అబ్దుల్ కలాం లాంటి గొప్ప శాస్రవేత్తలు మన దేశంలో పుట్టారని, అలాంటి వ్యక్తులని ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలని అన్నారు. ఎస్సై పొదిలి వెంకన్న మాట్లాడుతూ యువత ఎప్పుడు మార్పు కోసం ప్రయత్నిస్తున్నే ఉండాలని, కష్టపడితే విజయం మనదే అని అన్నారు. పట్టుదల కృషి ఉంటే సాధించలేనిది ఏమీ లేదన్నారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండంట్ షేక్ అన్సర్ పాషా, డైరెక్టర్ షేక్ లాల్ మహమ్మద్, ప్రిన్సిపాల్ అయిటిపాముల శ్వేత, అడ్మినిస్ట్రేషన్ పుచ్చకాయల నాగేశ్వరావు, విజ్ఞాన శాస్త్ర భోదకులు వెంకటేశ్వర్లు, వెంకట్, వాణి, శైలజ, కవిత, రుక్సానా, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -