Saturday, February 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అరోరా కళాశాల భవనాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి

అరోరా కళాశాల భవనాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి

- Advertisement -

– విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు కొత్మికర్ వినయ్ కుమార్
నవతెలంగాణ – కామారెడ్డి 

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల్లో నిర్మించబడిన అరోరా ఇంజనీరింగ్ కళాశాల భవనాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనీ విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు కొత్మికర్ వినయ్ కుమార్ డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం  విద్యార్థి సేన ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు కొత్తిమీర్ వినయ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములపై నిర్మించబడిన అరోరా ఇంజనీరింగ్ కళాశాల భవనాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు.

ఆ భవనం ప్రస్తుతం నిరుపయోగంగా ఉండటంతో అక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆ భవనంలో హాస్టల్ సదుపాయాలు ప్రారంభించి విద్యార్థులకు అండగా నిలవాలని విద్యార్థి సేన తరఫున కోరుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న బీసీ, ఎస్సీ హాస్టల్ ఇందిరానగర్ బొందలగడ్డ పక్కన ఉండి, కళాశాల నుండి దాదాపు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రతిరోజూ విద్యార్థులు ఆరు కిలోమీటర్లు నడుచుకుంటూ కాలేజీకి రావడం ఎంతో ఇబ్బందికరంగా మారిందని చెప్పారు.

విద్యార్థుల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని వెంటనే అరోరా ఇంజనీరింగ్ కళాశాల భవనంలో హాస్టల్ ప్రారంభించాల్సిందిగా డిమాండ్ చేశారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి చొరవ చూపి విద్యార్థులకు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సేన నాయకులు రాహుల్, సురేష్, అంజి, శ్రీకాంత్, వంశీ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -