– పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్
నవతెలంగాణ – కామారెడ్డి
జిల్లా కేంద్రంలోని కాకతీయ హై స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా సైన్స్ ఫెయిర్‌ను నిర్వహించారు. పాఠశాల ఆహ్వానం మేరకు మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ సృజనాత్మకతను ప్రతిబింబించే విధంగా వివిధ శాస్త్రీయ నమూనాలు, ప్రాజెక్టులను ప్రదర్శించారు. అతిథులు విద్యార్థుల ప్రతిభను ఆసక్తిగా వీక్షించి అభినందించారు.
విద్యార్థుల్లో శాస్త్ర విజ్ఞానంపై ఆసక్తి పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని చైర్ పర్సన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 37వ వార్డ్ కౌన్సిలర్ అరికల ప్రభాకర్ యాదవ్, 13వ వార్డ్ కౌన్సిలర్ కొత్తపల్లి లలిత, డీఈఓ రాజు, కరస్పాండెంట్ విజయ రాంరెడ్డి, ప్రిన్సిపాల్ సునీత పద్మిని, పాఠశాల అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.



