Saturday, February 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కెన్నెడీ పాఠశాలలో ఘనంగా సైన్స్ దినోత్సవ వేడుకలు

కెన్నెడీ పాఠశాలలో ఘనంగా సైన్స్ దినోత్సవ వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి 
సివి రామన్  కనుగొన్న రామన్ ఎఫెక్ట్ జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా స్థానిక కెన్నెడీ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలను విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా విద్యార్థులు స్వయంగా రూపొందించిన పలు శాస్త్రీయ నమూనాలు, ఆవిష్కరణలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఇలాంటి అపాయం లేకుండా తుపాకీ ద్వారా పేలుడు శబ్దం వచ్చే నమూనా, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ప్రాధాన్యత, క్షిపణి సాంకేతికత అభివృద్ధి, అలాగే పర్యావరణ పరిరక్షణలో చెట్లు, జంతువుల పాత్రను వివరించారు. దేశ భద్రతతో పాటు సైన్స్ రంగంలో భారతదేశం సాధించిన పురోగతిని  విద్యార్థులు వివరణాత్మకంగా తెలియజేశారు.

అలాగే “స్కేరీ హౌస్” పేరుతో ఏర్పాటు చేసిన వినూత్న ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాంఘిక మాధ్యమాల్లో వ్యాపించే పుకార్లు, వాటి దుష్ప్రభావాలు, వాటికి బానిసలవకుండా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ప్రదర్శన ద్వారా వివరించారు. ఈ వినూత్న ఆలోచన విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడంతో పాటు సందర్శకులను ఆలోచింపజేసింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సురేష్ డేనియల్, ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొని విద్యార్థులను అభినందించారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -