Saturday, February 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఐటిఐ కళాశాలను సందర్శించిన పంచాయతీ పాలకవర్గం సభ్యులు

ఐటిఐ కళాశాలను సందర్శించిన పంచాయతీ పాలకవర్గం సభ్యులు

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని బషీరాబాద్ గ్రామంలో ఉన్న కమ్మర్ పల్లి ప్రభుత్వ ఐటీఐ కళాశాలను కమ్మర్ పల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు శనివారం సందర్శించారు. సర్పంచ్ కొత్తపల్లి హారిక ఆధ్వర్యంలో ఉపసర్పంచ్ కొత్తపల్లి అశోక్, వార్డు సభ్యులందరూ కలిసి ప్రభుత్వ ఐటిఐ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఐటీఐలో ఏర్పాటు చేసిన ఆధునిక టెక్నాలజీ సెంటర్‌ను పరిశీలించారు. అక్కడ అందిస్తున్న వివిధ రకాల కోర్సుల వివరాలను ఫ్యాకల్టీ సభ్యులు వారికి వివరించారు.కళాశాలలో ప్రస్తుతం ఆరు రకాల లాంగ్ టర్మ్ కోర్సులు, మూడు రకాల షార్ట్ టర్మ్ కోర్సులు నిర్వహిస్తున్నామని తెలియజేశారు.

ఈ కోర్సుల ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని వివరించారు. ఈ సందర్భంగా  సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ మాట్లాడుతూ కమ్మర్ పల్లి గ్రామంలోని నిరుద్యోగ యువతి, యువకులకు ఈ కోర్సుల గురించి మైక్ ద్వారా ప్రచారం చేసి తెలియజేస్తామని చెప్పారు. గ్రామం నుండి పెద్ద సంఖ్యలో యువతను ఈ కోర్సుల్లో చేరేలా ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో  ఐటీఐ ప్రిన్సిపాల్ ఎం.కోటి రెడ్డి, అధ్యాపక బృందం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -