నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని బస్వాపూర్ గ్రామపంచాయతీ పాలకవర్గం సర్పంచ్ వి. రమణ సురేష్ గొండ. అధ్యక్షతన గ్రామసభ, పాలకవర్గ సమావేశం గ్రామంలోని పలు సమస్యలపై చర్చించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఈశ్వర్ చేసిన పాలకవర్గం సమావేశంలో 10 అంశాలను చర్చించి ఆమోదం తెలపడం జరిగింది.వేసవికాలం ప్రారంభం అయినందున తాగునీటి సమస్య రాకుండా చూడాలని బీసీ ఎస్సీ వార్డ్ లలో మురికి కాలువ నిర్మాణం చేయాలని తెలిపారు.
వీధి బల్బులు ఎప్పటికప్పుడు బిగించాలని సూచించారు. ఉపాధి హామీ పనులను అత్యధికంగా కూలీలు వచ్చే విధంగా అవగాహన , ప్రతి ఒక్క అర్హులైన పేదలకు కూలి పని కల్పించాలని అన్నారు. ప్రతి శుక్రవారం వాటర్ డే నిర్వహించి , శ్రమదాన కార్యక్రమంలో సర్పంచ్ తో సహా వార్డ్ సభ్యులు. గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు అందుబాటులో ఉన్న గ్రామ చిన్న పెద్దల్ని కలుపుకొని కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. గ్రామపంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవంగా ఆమోదించి తీర్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు ఉపసర్పంచ్ ,వార్డు సభ్యులు, గ్రామ కార్యదర్శి భరద్వాజ్ , గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.



