Saturday, February 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెద్దతూండ్ల హైస్కూల్లో విద్యార్థులకు క్విజ్ పోటీలు

పెద్దతూండ్ల హైస్కూల్లో విద్యార్థులకు క్విజ్ పోటీలు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని పెద్దతూoడ్ల గ్రామ జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో శనివారం విద్యార్థులకు ఆన్లైన్ క్విజ్ పోటీలు, సైన్స్ ఎగ్జిబిషన్  నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవాటు చేసుకోవాలని సైన్స్ ఉపాధ్యాయులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు మానస, ఉపాధ్యాయులు సిహెచ్ శర్మ, ఎండి యాకుపాష, సుజాత, గోపి నాయక్, చంద్రప్రకాశ్, ఓఎస్ సందీప్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -