– ప్రధానోపాధ్యాయులు వీరేశ్వరరావు
నవతెలంగాణ – అశ్వారావుపేట
మానవ పురోగతి కి శాస్త్రీయ తే శిరోధార్యం అని జెడ్పీహెచ్ఎస్ గుమ్మడి వల్లి ప్రధానోపాధ్యాయులు తాళ్ళపాటి వీరేశ్వరరావు అన్నారు. రామన్ ప్రభావం జ్ఞాపకంగా ప్రతీ ఏడాది ఫిబ్రవరి 28 ని దేశవ్యాప్తంగా జరుపుకునే జాతీయ విజ్ఞాన దినోత్సవం శనివారం మండలంలోని పలు పాఠశాలల్లో ఘనంగా నిర్వహించారు.
ఈ క్రమంలో మండలంలోని గుమ్మడి వల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కు డ్రాయింగ్, క్విజ్,వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అంద చేసి సైన్స్ టీచర్ అనూష ను శాలువతో సత్కరిం చారు.సీవీ రామన్ ఫోటో ను పూలదండ తో అలంకరణ చేసి,వారి జీవిత చరిత్ర ఆయన ఆవిష్కరణ ల గురించి విద్యార్థుల కు వివరించారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు వీరేశ్వరరావు మాట్లాడుతూ “విజ్ఞానం మన జీవితానికి వెలుగునిచ్చే దీపం అని,ప్రశ్నించటం నేర్చుకుంటేనే కొత్త ఆవిష్కరణలు పుడతాయి” అని అన్నారు.సీవీ రామన్ 1928 లో “రామన్ ప్రభావం”ను ప్రకటించిన రోజు జ్ఞాపకార్థం ఈ సైన్స్ డే జరుపుకుంటామని తెలిపారు.ఈ పరిశోధనకు ఆయనకు 1930 లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది అని తెలిపారు.
విద్యార్థుల్లో శాస్త్రీయత పొ ఆసక్తి పెంపొందించడం,శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని ప్రోత్సహించడం, శాస్త్రవేత్తల కృషిని స్మరించుకోవడం, సమాజ అభివృద్ధిలో విజ్ఞాన శాస్త్ర ప్రాధాన్యతను చాటడం ఈ సైన్స్ డే ఉద్దేశం అన్నారు.పాఠశాలల్లో నిర్వహించే కార్యక్రమాలు,సైన్స్ ప్రదర్శనలు,విజ్ఞాన క్విజ్ పోటీలు, ప్రాజెక్ట్ ప్రదర్శనలు, శాస్త్రవేత్తలపై ప్రసంగాలు, పోస్టర్ తయారీ పోటీలు లాంటి వి విద్యార్థులు చే రూపొందించడం లక్ష్యం అన్నారు.



