- Advertisement -
నవతెలంగాణ – దర్పల్లి
మండలకేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో వార్డు సభ్యులకు శనివారం నాటికీ శిక్షణ తరగతులు ముగిసినట్లు ఎంపిఓ రాజేష్ తెలిపారు. ఈసందర్బంగా అయన మాట్లాడుతూ.. గత పది రోజులుగా మండలంలో నూతనగా నియమితులులైన మండలంలోని అన్ని గ్రామాల వార్డు సభ్యులకు, రెండు దఫలుగా వారికీ విడతలవారీగా శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగిందని అన్నారు. పంచాయతీ పరిధిలోని చట్టాలపై, వారు చేపించవలసిన వివిధ పనుల నియమ నిబంధనలను వివరించి వారికీ అర్థమయ్యే విధంగా శిక్షణ అందించడం జరిగిందని అన్నారు. కార్యక్రమములో రామడుగు, హోన్నజీపేట, సీతాయిపేట, గ్రామాలకు చెందిన వార్డు సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -



