Saturday, February 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆదర్శ పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శన..

ఆదర్శ పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శన..

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకుని మండలంలోని ఎడ్లపల్లి అదర్శ పాఠశాలలో సోహం అకాడమీ హైదరాబాద్   వారు మినీ శిల్పారామం పేరిట వైజ్ఞానిక ప్రదర్శన శనివారం నిర్వహించినట్లుగా పాఠశాల ప్రిన్స్ పాల్ పూర్ణచంద్రరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత నెల రోజులుగా రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో ఆరవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు రోబోటిక్స్ లో శిక్షణ ఇచ్చి, ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులను ఎంపిక చేసి రాష్ట్రస్థాయిలో నిర్వహించిన ఐదవ వార్షిక రోబోటిక్స్ ఎగ్జిబిషన్ హైదరాబాదులోని మినీ శిల్పారామంలో  పాల్గొనే అవకాశం కల్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు స్మార్ట్ ఇరిగేషన్ అనే ప్రాజెక్టు రూపొందించి ఎగ్జిబిషన్లో పాల్గొని ఓడేటి ప్రణీత్ కుమార్ 9వ తరగతి, చాట్లపెళ్లి శ్రీనిధి, గైడ్ టీచర్ గా కర్రె అశోక్ వ్యవహరించారు.విద్యార్థులను ప్రిన్స్ పాల్ తోపాటు,ఉపాధ్యాయ బృందం, గ్రామ సర్పంచ్ జంగిడి శ్రీనివాస్ అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -