నవతెలంగాణ – అశ్వారావుపేట
రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్ పనుల నేపథ్యంలో ఆదివారం మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ అధికారులు శనివారం ప్రకటించారు.
రోడ్డు విస్తరణ పనులలో భాగంగా నూతన కరెంటు టవర్స్ పై 33 KV, 11 KV, LT వైర్స్ వేయడం,రోడ్ కు ఇరువైపులా ఉన్న పాత పోల్స్, వైర్లు తొలగింపు లో భాగంగా రేపు ఆదివారం విద్యుత్ సరఫరా లో అంతరాయం ఉంటుందని అన్నారు.
అశ్వారావుపేట – బూర్గంపాడు రోడ్ లో పోలీస్ స్టేషన్ నుండి పెద్ద రైస్ మిల్ వరకు,ఓల్డ్ ఆంధ్రాబ్యాంక్ వీధి,దండబత్తుల బజార్, గాంధీ బొమ్మ సెంటర్,ముస్లిం బజార్,దూదేకుల బజార్, చిన్నంశెట్టి బజార్, తూర్పు బజార్, వడ్డెర బజార్, అంబేద్కర్ నగర్, గౌడ బజార్, తిరుమల నగర్, శివయ్య గారి బజార్, గుర్రాల చెరువు రోడ్, రామాలయం బజార్, కొనేరు బజార్, పేటమాలపల్లి ప్రాంతాల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని తెలిపారు.



