- Advertisement -
నవతెలంగాణ – ముధోల్
ముధోల్ మండలంలోని ఆష్ట గ్రామానికి రూ.3 కోట్ల 47 లక్షల నిధులతో 33/11 కె. వి.విద్యుత్ సబ్ స్టేషన్ ను ప్రభుత్వం మంజూరు చేసిందని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ శనివారం రాత్రి ఓక్క ప్రకటనలో తెలిపారు. ఆయా గ్రామాల ప్రజలకు విద్యుత్ సమస్య తలెత్తకూడదన్న ఉద్దేశం తో సబ్ స్టేషన్ మంజూరు చేయించడం జరిగిందన్నారు. ఈ పనులు పూర్తి అయితే ఈ ప్రాంత ప్రజలకు విద్యుత్ సమస్య తీరుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సబ్ స్టేషన్ మంజూరు చేసినందుకు ప్రభుత్వానికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -



