- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని కాచాపూర్ గ్రామంలో ఉపాధి హామీ కూలీ పనులను గ్రామ సర్పంచ్ పాలమాకుల జ్యోతి సంతోష్ గౌడ్ పరిశీలించారు. పనుల నాణ్యత, కూలీల హాజరు వివరాలను పరిశీలించి, సమయానికి వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కూలీలు నిబంధనల ప్రకారం పనులు నిర్వహించాలన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతి కార్యదర్శి మౌనిక, టిఏ రాజు, కూలీలు, పంచాయతి సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



