- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
ప్రపంచ టైలర్స్ డే సందర్భంగా శనివారం లయన్స్ క్లబ్ ఆఫ్ నవనాథాపురం ఆధ్వర్యంలో దర్జీలు శ్రీనివాస్, చంద్రశేఖర్ లను సన్మానించడం జరిగింది. బ్రాండెడ్ షోరూమ్స్ అనేకం వచ్చిన దర్జీ వృత్తిని ఇంకా కొనసాగించడం అభినందనీయం అని జోన్ చైర్మన్ చెరుకు పృథ్వీరాజ్, కోశాధికారి గుర్రం విజయానంద్ లు అన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు సురేందర్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



