Saturday, February 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మద్దికుంట పాఠశాలలో సైన్స్ ఫెయిర్ 

మద్దికుంట పాఠశాలలో సైన్స్ ఫెయిర్ 

- Advertisement -

నవతెలంగాణ-రామారెడ్డి 
మండలంలో సివి రామన్ కనుగొన్న రామన్ ఎఫెక్ట్, సందర్భంగా జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఆయా పాఠశాలలో శనివారం నిర్వహించారు. మద్దికుంట జిల్లా పరిషత్ పాఠశాలలో సైన్స్ ఫెయిర్ ను నిర్వహించారు. 15 విజ్ఞాన శాస్త్ర ప్రదర్శన నమూనాలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంఈఓ ఆనంద్ రావు పాల్గొని జ్యోతి ప్రజ్వలన నిర్వహించారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన నమూనాలను పరీక్షించారు. ఈ సందర్భంగా ఆనంద్ రావు మాట్లాడుతూ… సివి రామన్ గొప్పతనాన్ని వివరించారు.

పదవ తరగతి విద్యార్థులు రానున్న పరీక్షలకు సన్నద్ధమై, మెరుగైన ఫలితాలను సాధించాలని సూచించారు. పల్వంచ, ఉప్పల్ వై జిల్లా పరిషత్ పాఠశాలలో గల సైన్స్ ల్యాబ్ లను విద్యార్థులు వీక్షించడానికి రావాల్సిందిగా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కోరారు. అనంతరం ఎంఈఓ తో పాటు పలువురిని శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు ఆనంద్, స్థానిక ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్, సైన్స్ ఉపాధ్యాయులు బాలకిషన్, పల్వంచ ప్రధానోపాధ్యాయులు గోవర్ధన్ రెడ్డి, రామారెడ్డి పిహెచ్సి వైద్యులు సురేష్, ఉప సర్పంచ్ రాజు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు లింగమాచారి, సాయి రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -