Saturday, February 28, 2026
E-PAPER
Homeక్రైమ్జాతీయ రహదారిపై తప్పిన పెను ప్రమాదం

జాతీయ రహదారిపై తప్పిన పెను ప్రమాదం

- Advertisement -

పాఠశాల బస్సును వెనుక నుండి ఢీ కొట్టిన లారీ
నవతెలంగాణ – కట్టంగూర్

జాతీయ రహదారిపై శనివారం పెను ప్రమాదం తప్పింది. నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు డ్రైవర్ అజాగ్రత్తగా జాతీయ రహదారిపై యూటర్న్ తీసుకోవడంతో దానిని తప్పించబోయిన లారీ డివైడరున్ ను ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాదంలో లారీ డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. బస్సులోని విద్యార్థులకు స్వల్పగాయాలయ్యాయి. మండల కేంద్రంలోని ఎస్ఎస్ వీఎన్ ప్రైవేట్ పాఠశాల సాయంత్రం ముగియగానే పాఠశాలకు చెందిన బస్సు 23 మంది విద్యార్థులు, ముగ్గురు ఉపాధ్యాయులతో బొల్లెపల్లికి బయలుదేరింది.

కట్టంగూర్ శివారులో శ్రీకృష్ణనగర్ వద్ద 65వ జాతీయ రహదారిపై బస్సు డ్రైవర్ గమనించకుండా అజాగ్రత్తగా యూటర్న్ తీసుకునే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో కోదాడ నుంచి హైదరాబాద్ వైపు సిమెంట్ ఇటుకల లోడుతో వెళ్తున్న లారీ డ్రైవర్ బస్సును గమనించాడు. దీంతో బస్సును తప్పించే క్రమంలో లారీ అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టి విజయవాడకు వెళ్లే వైపు రహదారిపై బోల్తా పడింది. ప్రమాదంలో లారీ డ్రైవరుకు తీవ్రగాయాలయ్యాయి.

లారీ బస్సు వెనుక భాగాన్ని స్వల్పంగా ఢీకొనడంతో విద్యార్థులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. పాఠశాల బస్సు ప్రమాదానికి గురైదని తెలియగానే విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. విద్యార్థులు స్వల్పగాయాలతో బయటపడడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. తీవ్రంగా గాయపడిన లారీ డ్రైవర్ ను చిక్సిత కోసం నార్కట్ పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -