Sunday, March 1, 2026
E-PAPER
Homeక్రైమ్వ్యక్తిగత కారణాలతో యువతి ఆత్మహత్య

వ్యక్తిగత కారణాలతో యువతి ఆత్మహత్య

- Advertisement -

నవతెలంగాణ – రామారెడ్డి 
వ్యక్తిగత కారణాలతో యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన పల్వంచ మండలం సింగరాయపల్లి లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలకు ప్రకారం.. శుక్రవారం సాయంత్రం గ్రామానికి చెందిన తెడ్డు అనిత (22) ఆమె పాత ఇంట్లో , దూలానికి చున్నితో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు మేనత్త తెడ్డు శామవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు రామారెడ్డి ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో శివ పంచినామా, పీఎంఈ నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -