Sunday, March 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతులు సహజ వ్యవసాయంపై అవగాహన కలిగి ఉండాలి

రైతులు సహజ వ్యవసాయంపై అవగాహన కలిగి ఉండాలి

- Advertisement -

– సహజ వ్యవసాయ రిసోర్స్ పర్సన్ ఆదిలక్ష్మి
నవతెలంగాణ – ఊరుకొండ

రైతన్నలు సహజ వ్యవసాయంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని.. సహజ వ్యవసాయం వల్ల అధిక దిగుబడులతోపాటు నాణ్యమైన పంటను పండించవచ్చని సహజ వ్యవసాయ రిసోర్స్ పర్సన్ ఆదిలక్ష్మి సూచించారు. శనివారం ఊరుకొండ మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో మండల వ్యవసాయ అధికారిని దీప్తి అధ్యక్షతన మండలంలోని ఆయా గ్రామాల రైతులకు సహజ వ్యవసాయంపై పూర్తి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ(ఏటీఎమ్ఏ) వారి సౌజన్యంతో జిల్లా పరిధిలో సహజ వ్యవసాయo పై అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. సహజ వ్యవసాయ పద్ధతులు, జీవామృతం, భీజామృతం, నీమాస్త్రం, పంచగవ్య తదుపరి వాటి తయారీ విధానం నేరుగా రైతులకు చూపించి వాటి లాభాలను గూర్చి వివరించారు. పర్యావరణ రక్షణ మరియు మనిషి ఆరోగ్యం పై సహజ వ్యవసాయo ఎంతో మార్పు చూపిస్తుంది అని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ మేకల మంజుల, ఇన్చార్జి ఏడిఏ మంజుల, ఊరుకొండ మండల వ్యవసాయ అధికారిని దీప్తి, ఏఈవోలు అరుణ, మానస, బాలరాజు, ఆంజనేయులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -