Sunday, March 1, 2026
E-PAPER
Homeజోష్యువత ఆలోచించాలి

యువత ఆలోచించాలి

- Advertisement -

ప్రతి జాతి మనుగడ ఆ జాతి వద్ధిపై ఆధారపడి ఉంటుంది. 70, 80 దశకాల్లో జనాభా పెరుగుదల అనేది ఒక సమస్య. అదే నేడు దేశ ఆర్థిక వనరు. నాడు జనాభా క్షీణత అన్నది ప్రభుత్వ ప్రధాన ఏజెండా. అదే నేడు రాబోవు జాతీయ సమస్య. ఈ జనాభా వద్ధి రేటు క్షీణత ద్వారా దేశ, కుటుంబ వ్యవస్థల్లో చోటుచేసుకునే పరిణామాల గురించి ప్రముఖ గైనకాలజిస్ట్‌ డా. శిల్పి రెడ్డి మాటల్లోనే…

ట్రేండింగ్‌ మోజులో యువత
యువతలో ‘పెళ్ళంటే ఒక నరకం’ అన్న భావన ఎక్కువగా ప్రసారం జరుగుతుంది. ముఖ్యంగా సోషల్‌ మీడియా, సినిమా మాధ్యమాల ద్వారా. 23-27 ఏళ్ళ వయసు మధ్యలో హార్మోన్స్‌ నాణ్యత అధికంగా ఉంటుంది. వాస్తవానికి అదే సరైన శారీరక-మానసిక వయసు. కానీ అదే దశలోని యువత Dink (Dulel income no kinds), solo life so better, single king వంటి పనికిమాలిన ట్రేండింగ్‌ లలో పడి పెళ్లికి విముఖత చూపుతున్నారు. ఇటువంటి ట్రేండింగ్‌ వాళ్ళ కొంతకాలం స్వేచ్చా జీవులమనిపించినా 30 ఏళ్ళకు దగ్గరయ్యే కొద్ది మిత్రులలేమి, భావోద్వేగాలలేమి, మానసిక సాంగత్యలేమి వంటి లోటు అంశాలతో తీవ్ర మానసిక అలజడికి గురవుతారు. అప్పటికే పెళ్లి ఈడు దాటిపోవడం ద్వారా సరైన సంబంధాలు దొరక్క, సంతాన శక్తి కోల్పోవడం వంటివి అధికమవుతాయి. ఉడుకు రక్తంలో జరిగే తప్పటడుగులు వారినే కాదు కుటుంబాన్ని, దేశాన్ని ప్రభావితం చేస్తాయి.

నిరుద్యోగం కూడా కారణమే
ఆధునిక భారతదేశం ఇప్పుడిప్పుడే చదువుకొని నగరాల్లో స్థిరపడుతున్న మొదటితరం అధికమవుతుంది. ఈ యువతకు జువీ× తో ప్లాట్‌ కొనడం, ఇన్వెస్ట్మెంట్‌ చెయ్యడం వంటివి ఊరించే అవసరాలు. వీటికి ఐదంకెల జీతం వచ్చేవారు మాత్రమే ముందడుగు వెయ్యగలరు. కేవలం పొట్ట చేతపట్టుకొని ఉపాధికోసం నగరమోచ్చిన యువతకు కిరాయితో పూటగడవడమే గగనంగా మారుతుంది. ఇక సంసారం నడపాలంటే స్థాయికి మించిన భారంగా నిస్తుంది. ఇక చదువుకు తగ్గ కొలువు, శ్రమకు తగ్గ ప్రతిఫలం అందని వారు పెళ్ళికి భయపడుతున్నారు. ‘ఆర్థికంగా స్థిరమయ్యాక పెళ్లి గురించి ఆలోచిద్దాం’ అనే భావనలోనే అధికంగా ఉన్నారు. వీటన్నిటికంటే నిరుద్యోగం జనాభా క్షీణతపై అధిక ప్రభావం చూపుతుంది. ముంబాయి, బెంగళూరు, చెన్నై, కలకత్తా, హైదరాబాదు వంటి మహానగరాల్లో సగటున ఒక కుటుంబం నడవాలంటే 30 నుంచి 35 వేల మధ్యన ఉండాలని చాలా నివేదికలు తెలిపాయి. అటువంటప్పుడు నగరంలో నిరుద్యోగులు, అరకొర జీతగాళ్ళు పెళ్ళికి పెద్దలు పోరు పెట్టినాముందడుగు వెయ్యట్లేదు. ‘తాను దూర సందు లేదు మేడకేమో డోలా’ అని వాళ్ళ ఆర్ధికస్థితి వెక్కరిస్తుంది.

గ్రామీణంలో భిన్న ధోరణి
చదువుకొని, డ్రాప్‌ అవుట్‌గా మిగిలిన గ్రామీణ యువత పల్లెల్లోనే ఉంటూ వ్యవసాయ, వాటి అనుబంధిత పనుల్లో జీవిస్తున్నారు. వీరు పెళ్ళికి సిద్ధంగా ఉన్నా వీరిని పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు సుముఖంగా లేరు. ప్రధానంగా చూస్తే దీనికి ఒకింత పట్నం జీవితంపై మోజు, వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడం, ‘నగరంలో సుఖం -పల్లెలో కాయ కష్టం’ అన్న భావన అధికమయ్యి పల్లెల్లో వివావాహాలు సరిగా జరగడం లేదు. నగరంలో స్థిరపడే యువకుడికి పిల్లను ఇస్తామంటే చేసుకోవడానికి సిద్ధంగా లేడు. పల్లెలోని యువకుడు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా అంటే పిల్లను ఇవ్వట్లేదు. ఇదేక్కువగా గ్రామీణ అగ్రవర్ణాలలో అధికంగా కనబడుతుంది. ఇప్పుడిప్పుడే ఇతర సామాజికవర్గ గ్రామీణ కుటుంబాల్లోకి ప్రవేశిస్తూ ఉంది. ఒక దేశ ప్రగతిని ఆర్ధిక అసమానతలే కాదు వివాహ అసమానతలు కూడా ప్రభావితం చేయ్యబోతున్నాయని ఈ జనాభా తరుగుదల ద్వారా ఎదురుకాబోతుంది.

ప్రజలు-ప్రభుత్వం కలిస్తేనే పరిష్కారం
జీవన ప్రమాణాలే ఆధునిక మనిషి జీవితం ఎంతగా ఆస్వాదిస్తున్నాడో నిర్ణయించేవి. ప్రస్తుత భారతదేశంలో సుమారు వంద కోట్ల మంది కనీస ఆదాయానికి దిగువనే ఉన్నారు. 15 కోట్లవరకు నిరుపేదలు ఉన్నారు. ఇక 6 కోట్ల మంది మధ్యతరగతి, 2 కోట్ల మంది ఎగువ మధ్యతరగతి కాగా సంపన్నులు కేవలం 20 లక్షల మందే. ఈ అధిక జనాభా పేదరికం, కనీస ఆదాయంలేని కేటగిరుల్లో ఉండడంమే దేశ జనాభా క్షీణతకు కారణం. దీని ద్వారా పెళ్ళిళ్ళలో అసమానతలు. సంతాన సమస్యలు అధికమయ్యాయి. వైద్య గణాంకాల ప్రకారం దేశంలో సగటున ‘స్త్రీల గర్భధారణ రేటు’ (టోటల్‌ ఫెర్టిలిటీ రేట్‌-TFR ) ) 1.6 గా ఉంది. వాస్తవానికి ఆ రేటు 2.1 గా ఉన్నప్పుడు ఆ దేశ జనాభా స్థిరంగా ఉంటుంది. ‘ఒకరు లేదా ఇద్దరు'(one or non-1980) అన్న చైనా, ‘చిన్న కుటుంబం-చింత లేని కుటుంబం’ అన్న ఇండియా వంటి దేశాలో 2060 కి జనాభా తరుగుదల ఎదుర్కొబోతున్నాయి. ఇకా ఐరోపా దేశాల గురించి చెప్పనవసరం లేదు. వాళ్ళు ఇప్పుడే ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ప్రధానమైన సమస్య ఏదంటే రాజకీయ నాయకులు ‘ఎంతమంది పిలల్ని వీలైతే అంతమందిని కనండి’ అని చెబుతూ ఉన్నా, కొన్ని దేశాలు, కంపెనీలు ప్రత్యేక ప్రోత్సహకాలు ఇస్తూ ఉన్న అధిక యువత ‘సింగిల్‌ కింగ్స్‌’ ‘మేమిద్దరం-మాకేవరొద్దు’ అనే ఆలోచన ధోరణిలో ఉన్నారు. దీనిపై మేధో చర్చలు మొదలయ్యాయి. చట్టసభల్లోనూ, విశ్వవిద్యాలయం స్థాయిలలోనూ చర్చలు నడవాలి. వాస్తవంగా, క్షేత్ర స్థాయిలో ఉన్న విషయాలపై శ్రద్ధ పెట్టాలి. ‘గ్రామీణ వ్యవస్థ-కుటుంబ వ్యవస్థ’ భారతదేశానికి ఊపిరితిత్తులువంటివి. అవి కాలుష్యం కాకుండా కాపాడుకోవాలి. ఇది ‘ప్రభుత్వ ఎజెండా, ప్రజల సానుకూల ఆలోచనలు’ కలిస్తేనే జోడెడ్ల బండిలా సాగుతుంది. లేకుంటే ‘రెండుకాళ్ళ రెండు పడవల’ ప్రయాణంలా మారుతుంది. ఏది ఏమైనా ‘దేశమంటే మట్టికాదో దేశమంటే మనుషులోరు’ అన్న గురజాడ వాక్యం దేశం కొత్తకోణంలో చూడాల్సివుంటుంది.

బబుల్స్‌ లో ఇవ్వాల్సిన సమాచారం:
జనాభా సమస్య ఎదుర్కొంటున్న 5-దేశాలు : జపాన్‌, ఇటలీ, థారులాండ్‌, స్పెయిన్‌, పోలాండ్‌.
2060లో ఎదుర్కోబోయే దేశాలు-5 : ఇండియా, చైనా, దక్షిణ కొరియా, జర్మనీ, పోర్చుగల్‌.
ప్రస్తుతం జనాభా ప్రయోజనాన్ని పొందుతున్న దేశాలు: ఇండియా, చైనా, నైజీరియా, అమెరికా, ఇండోనేషియా.
డా. శిల్పి రెడ్డి ఫౌండేషన్‌ నుంచి గత పదేళ్ల నుంచి మూడు ప్రధాన ఈవెంట్లను ఉచితంగా నిర్వహిస్తున్నారు.
1. ‘మిసెస్‌.మామ్‌’: ప్రెగెన్సీ తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యలపై అవగాహన, అందుకు సంబంధించిన జాగ్రత్తలు, ఆహార అలవాట్ల గురించి ప్రాక్టికల్‌ సెషన్స్‌ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ప్రతి ఏటా నవంబర్‌ నెలలోని చివరి వారంలో ఓ వారం రోజుల పాటు ‘మిసెస్‌.మామ్‌’ వారోత్సవాలు నిర్వహిస్తారు.
2. ‘ఫెర్టిలిటీ కంక్లైవ్‌’: ఎటువంటి డ్రగ్‌ మేడిసన్‌ లేకుండా పూర్వపు రోజుల్లో ఎలా అయితే సహజ పద్ధతుల్లో సంతానం కలిగేదో ఆ విధంగా సంతానం కలగడానికి కావాల్సిన మెలుకువలు నేర్పబడుతాయి. ముఖ్యంగా జీవన శైలికి సంబంధించిన అంశాలు ఎక్కువగా ఉంటాయి. ఇదికూడా వారం రోజుల పాటు ప్రతి ఏటా నవంబర్‌ మూడో వారంలో నిర్వహిస్తారు.
3. ‘ఉమెన్‌ హెల్త్‌ కంక్లైవ్‌’: చిన్న చిన్న ఆరోగ్య సమస్యల వల్ల ప్రెగెన్సీ కానీ వాళ్ళు ఇందులో పాల్గొనే వెసులుబాటు ఉంది. ప్రతి ఏటా డిసెంబర్‌ మొదటి వారంలో http://www.drkshilpireddy.com ఈ కంక్లైవ్‌ నిర్వహిస్తారు. పై మూడు ఈవెంట్లు ఉచితంగా ఎవరైనా ఉచితంగా పాల్గొనవచ్చు. అందుకు సంబంధించిన సమాచారం లో దొరుకుతుంది.

బి.మదన్‌ మోహన్‌రెడ్డి
99898 94308

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -