Sunday, March 1, 2026
E-PAPER
Homeకవితకవయిత్రి అంతరంగ యవనిక

కవయిత్రి అంతరంగ యవనిక

- Advertisement -

ఇంటిల్లిపాదికి చాకిరీ చేస్తూ ఎన్ని నిద్రలేని
రాత్రులో రాతలౌతున్నాయి
అచ్చులోకొచ్చిన పిదప పెనిమిటి కోపానికి
గురై వొంటిమీద అద్దకపు వాతలౌతున్నారు
మధ్యతరగతి వనితలకు వధ్యశిలలకు కొదువలేదు
కొనుక్కున్న మొగుడు సైతం మోరెత్తి హూంకరిస్తున్నాడు
ఉలకడు పలకడు కాని
చిన్న చిన్న కోరికల్ని సైతం
ఇటు తోసిపుచ్చుతూనే
అటు తన కోరికలకు
కొరకే తెగరచ్చ చేస్తాడు
అటు ఇటు గడుస్తున్న కాలం గడిపిన కాపురం
ఇద్దరు కాయలు కాస్తే
సంసారం మెరుగు పడకపోగా
పడక గొడవలనుండి
పిడకిళ్లు బిగిసి గుద్దుల వరకు
దూరం మరింత దూరమై
శరీరాల మధ్య గోడకట్టేంత దిశలో
కాఠిన్యమైపోయింది.
వ్యాసంగం ఆగిపోవడం ఆత్మహత్యాసదశమే.
నెలరోజుల తర్జనభర్జన ప్రభావం పరస్పరాంగీకారంతో విడిపోవడానికి
చప్పట్లు కొట్టి
ఆకులు విడిగా పోయానని దిగులు లేదు.
స్వేచ్ఛ దొరికిందిగా
పచనంతో పాటు వచనం
సాహిత్యరూపం సంతరించుకుని
నేనుగా ఒదగడానికి.. నిటారుగా ఎదగడానికి..
ఆసరా అయిందిగా, స్వగతాలన్ని గతాలైతే
గతుకు బతుకుకు మెతుకు దొరకబుచ్చుకుంటే
రోటి పచ్చడితోనైనా ముద్ద మింగేస్తూ, వ్యాసంగమవరోధాలధిగమించి అక్షరాలను సంధిస్తూ గడిపేస్తున్నాను హాయిగా.
కపిల రాంకుమార్‌, 9849535033

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -