Sunday, March 1, 2026
E-PAPER
Homeసినిమా'సన్‌ ఆఫ్‌'కి అద్భుత స్పందన

‘సన్‌ ఆఫ్‌’కి అద్భుత స్పందన

- Advertisement -

సాయి సింహాద్రి సైన్మా బ్యానర్‌ మీద సాయి సింహాద్రి హీరోగా, నిర్మాతగా చేసిన చిత్రం ‘సన్‌ ఆఫ్‌’. బత్తుల సతీష్‌ తెరకెక్కించారు.
ఫిబ్రవరి 27న రిలీజ్‌ చేసిన ఈ చిత్రానికి చాలా మంచి స్పందన వస్తుంది. ఈ నేపథ్యంలో శనివారం ఈ చిత్ర సక్సెస్‌ మీట్‌ను మేకర్స్‌ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ కార్యదర్శి తుమ్మల ప్రసన్నకుమార్‌, హీరో, నిర్మాత సాయి సింహాద్రి, హీరోయిన్‌ మీరా రాజ్‌, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌ శోభారాణి, డిస్ట్రిబ్యూటర్స్‌ తదితరులు పాల్గొన్నారు. ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ కార్యదర్శి తుమ్మల ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ, ‘సినిమాపై ప్యాషన్‌తో ఈ సినిమా చేసిన సాయి సింహాద్రికి తొలి సినిమాతో చాలా మంచి రెస్పాన్స్‌ రావటం చాలా ఆనందంగా ఉంది. ఈ జర్నీలో తనకు సపోర్ట్‌గా నిలిచిన శోభారాణికి అభినందనలు. సాయి భవిష్యత్తులో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను’ అన్నారు.
‘సినిమాని 300 థియేటర్స్‌లో విడుదల చేసేలా సపోర్ట్‌ చేశాను. తండ్రీ కొడుకుల మధ్య ఉండే ఎమోషనల్‌ బాండింగ్‌, సంఘర్షణ కాన్సెప్ట్‌ నాకు నచ్చటంతో ఈ సినిమాను రిలీజ్‌ చేశాను. సాయితో ఇతర నిర్మాతలు సినిమాలు చేయటానికి ఆసక్తి చూపిస్తుండటం అభినందనీయం’ అని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌ శోభారాణి చెప్పారు.
హీరో, చిత్ర నిర్మాత సాయి సింహాద్రి మాట్లాడుతూ, ‘యుఎస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఆర్కిటెక్‌గా ఉన్న నేను సినిమా రంగంపై ఉన్న ఆసక్తితో ఇక్కడకు వచ్చాను. చాలా ఒడిదొడుకులు ఎదుర్కొంటూ సినిమాను విజయవంతంగా పూర్తి చేశాను. ఫిబ్రవరి 27న మూవీని రిలీజ్‌ చేయటం నా సక్సెస్‌గా నేను భావిస్తున్నాను. హీరోయిన్‌ మీరా రాజ్‌, శోభారాణి అందించిన సపోర్ట్‌కు థాంక్స్‌’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -