Sunday, March 1, 2026
E-PAPER
Homeసినిమారియల్‌ కబడ్డీ ప్లేయర్స్‌తో 'మహిళా కబడ్డీ'

రియల్‌ కబడ్డీ ప్లేయర్స్‌తో ‘మహిళా కబడ్డీ’

- Advertisement -

తెలంగాణ ఫిలింఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఛైర్మన్‌ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్‌ తన ఆర్కే ఫిలింస్‌ బ్యానర్‌ పై నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మహిళా కబడీ’్డ.
ఇందులో ఇండియన్‌ ఉమెన్స్‌ కబడ్డీ టీమ్‌ వైస్‌ కెప్టెన్‌ పూజ నర్వాల్‌, ఇండియన్‌ కబడ్డీ టీమ్‌ కోచ్‌ శ్రీనివాస్‌ రెడ్డి, హీరో సుమన్‌, అక్సాఖాన్‌, తులసితో పాటు ఏడుగురు రియల్‌ కబడ్డీ ప్లేయర్స్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇండియన్‌ కబడ్డీ టీమ్‌ కోచ్‌ శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ,’ఈ సినిమా కోసం ఆర్కే గౌడ్‌ నన్ను అప్రోచ్‌ అయ్యారు. క్రికెట్‌ తర్వాత కబడ్డీకే ఎక్కువ ఆదరణ ఉంది. క్రికెట్‌లో మహిళల జట్టు ఎలా రాణిస్తున్నారో కబడ్డీలోనూ అలాగే ప్రతిభ చాటుతున్నారు’ అని అన్నారు. ఇండియన్‌ ఉమెన్స్‌ కబడ్డీ టీమ్‌ ప్లేయర్‌ పూజ నర్వాల్‌ మాట్లాడుతూ,’కబడ్డీని ప్రొఫెషనల్‌గా ఎంచుకునే అమ్మాయిలకు మంచి భవిష్యత్‌ ఉంటుంది. ఇలాంటి టైమ్‌లో ఈ సినిమాను ఆర్కే గౌడ్‌ రూపొంది స్తుండటం, ఇందులో నేను నటించడం సంతోషంగా ఉంది’ అని తెలిపారు.
దర్శక, నిర్మాత డా. ప్రతాని రామకష్ణ గౌడ్‌ మాట్లాడుతూ,’నేను కూడా కబడ్డీ ప్లేయర్‌ని. పల్లెటూరి నుంచి వచ్చిన ఒక పేద అమ్మాయి కబడ్డీ ఆటలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎలా పేరు తెచ్చుకుంది, ఆ క్రమంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంది అనేది కథాంశం’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -