Sunday, March 1, 2026
E-PAPER
Homeసినిమా'బ్యాండ్‌ మేళం' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

‘బ్యాండ్‌ మేళం’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

- Advertisement -

‘కోర్ట్‌’ చిత్రంలో హర్ష్‌ రోషన్‌, శ్రీదేవీ తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. మళ్లీ ఇప్పుడు వీరిద్దరూ కలిసి ‘బ్యాండ్‌ మేళం’ అంటూ ఆడియెన్స్‌ ముందుకు రాబోతున్నారు. రచయిత కోన వెంకట్‌ నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం రూపు దిద్దుకుంది. మ్యాంగో మాస్‌ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ బ్యానర్‌ మీద కావ్య, శ్రావ్య ఈ మూవీని నిర్మించారు.
సతీష్‌ జవ్వాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని మార్చి 13న రిలీజ్‌ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల రిలీజ్‌ చేసిన టీజర్‌, ‘తిప్పూ కుంటానవ్‌’ అనే పాట ఎంతగా వైరల్‌ అయ్యాయో అందరికీ తెలిసిందే.
ఇక తాజాగా ఈ మూవీ నుంచి రెండో పాటను విడుదల చేశారు. ‘పల్లెలోని సందల్లన్ని మీవే’ అంటూ సాగే ఈ మెలోడీ పాటను హీరో రవితేజ సోషల్‌ మీడియా వేదికగా రిలీజ్‌ చేశారు. పాటను రిలీజ్‌ చేసిన అనంతరం ఆయన టీమ్‌కి బెస్ట్‌ విషెస్‌ను తెలియజేశారు.
ఈ బ్యూటీఫుల్‌ మెలోడీ పాటకు విజరు బుల్గానిన్‌ ఎంతో క్యాచీ ట్యూన్‌ను అందించారు. గీత రచయిత చంద్రబోస్‌ సాహిత్యం ఎంతో అర్థవంతంగా ఉంది. శ్వేతా మోహన్‌ ఆలపించారు. సాయికుమార్‌ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి నిర్మాతలు: కావ్య, శ్రావ, సహ నిర్మాత: శివరాజు ప్రణవ్‌, రచయిత, దర్శకుడు: సతీష్‌ జవ్వాజి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -