– ట్రంప్ సుంకాల దెబ్బతో ప్రత్యామ్నాయ మార్కెట్ల వైపు చూపులు
– సమస్యల సుడిగుండంలో భారత సోలార్ తయారీదారులు
– భారీగా పెరిగిన ముడిసరుకు ధరలు
– కొంపముంచిన పీఎల్‌ఐ పథకం
– డిమాండ్‌కు మించి సోలార్ మాడ్యూల్స్ సరఫరా
న్యూఢిల్లీ : విచారణకు సహకరించేందుకు అదానీ గ్రూప్ కంపెనీలు నిరాకరించిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత సౌర దిగుమతులపై భారీగా సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ఈ పరిణామం భారతీయ సౌర ఉత్పత్తిదారులకు అశనిపాతంగా మారింది. అమెరికాకు సోలార్ మాడ్యూల్స్‌ను ఎగుమతి చేయడం ఖర్చుతో కూడిన వ్యవహారం కావడంతో ఇప్పుడు ఉత్పత్తిదారులు యూరప్, ఆఫ్రికా వంటి ప్రత్యామ్నాయ మార్కెట్లపై దృష్టి సారిస్తున్నారు. భారత సౌర ఉత్పత్తి సామర్ధ్యం 2020 నుంచి ఏకంగా 13 రెట్లు పెరిగింది. దీనికి ప్రధాన కారణం నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ). 2030 నాటికి ఐదు వందల గిగాబైట్ల పునరుత్పాదక ఇంథన లక్ష్యాన్ని చేరుకోవడంతో పాటు మన దేశం చైనా నుంచి సౌర దిగుమతులను తగ్గించుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం దేశీయంగా ఉత్పత్తిని ప్రోత్సహించడానికి పీఎల్‌ఐని ముందుకు తెచ్చింది.
పెరిగిన సరఫరాలతో ఎగుమతులపై దృష్టి
దేశంలో సౌర ఉత్పత్తిని పెంచాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరినప్పటికీ, తయారీదారులకు రెండు సమస్యలను సృష్టించింది. స్థానిక డిమాండును మించి సరఫరాలు పెరిగాయి. ఫలితంగా తయారీదారులు ఎగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. కీలక అమెరికా మార్కెట్‌కు జరుగుతున్న ఎగుమతులపై తీవ్రమైన టారిఫ్ భారం పడుతోంది. భారత ప్రభుత్వం తన ఉత్పత్తిదారులకు సబ్సిడీలతో కూడిన ప్రోత్సాహకాలు అందిస్తున్న విషయాన్ని గుర్తించిన ట్రంప్ ప్రభుత్వం తాజాగా మన దేశం నుంచి జరుగుతున్న సౌర దిగుమతులపై ఏకంగా 126 శాతం సుంకాన్ని విధించారు. ఇండొనేషియా, లావోస్ దేశాల నుంచి కూడా సౌర దిగుమతులు జరుగుతున్నప్పటికీ వాటిపై ఈ స్థాయిలో సుంకాన్ని విధించడం లేదు. గత సంవత్సరం తొలి ప్రథమార్ధంలో అమెరికాకు జరిగిన సోలార్ మాడ్యూల్స్ ఎగుమతుల్లో ఈ మూడు దేశాల వాటా 57 శాతంగా ఉందని బ్లూమ్‌బర్గ్ న్యూ ఎనర్జీ ఫైనాన్స్ (బీఎన్‌ఈఎఫ్) తెలిపింది.
నూతన మార్కెట్ల కోసం అన్వేషణ
గత సంవత్సరం కాంబోడియా, వియత్నాం, మలేషియా, థాయిలాండ్ దేశాల దిగుమతులపై అమెరికా అత్యధికంగా 3,521 శాతం సుంకాలను విధించింది. దీనివల్ల మన దేశం నుంచి జరిగిన ఎగుమతులు పోటీలో నిలబడగలిగాయి. అమెరికా విధించే సుంకాలపై తుది నిర్ణయాన్ని జూలై 6 నాటికి ప్రచురిస్తారు. అప్పుడు మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అమెరి కా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రస్తుతం ఆయా దేశాలపై డంపింగ్ నిరోధక దర్యాప్తును నిర్వహిస్తోంది.
మన దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్న సౌర మాడ్యూల్స్‌పై ట్రంప్ ప్రభుత్వం పెద్ద మొత్తంలో టారిఫ్ విధించిన నేపథ్యంలో తయారీదారులు కొత్త మార్కెట్లను అన్వేషించే పనిలో పడ్డారు. ముఖ్యంగా యూరప్, ఆఫ్రికా మార్కెట్లపై వారు దృష్టి సారించారు. అదే సమయంలో చైనా ఆధిపత్యంతో పోటీ పడేందుకు తమ సామర్ధ్యాన్ని మెరుగుపరచుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. చైనా మాదిరిగా భారత్ కూడా ఆఫ్రికా దేశాలకు రుణ సదుపాయం కల్పించి సౌర ఉత్పత్తి ప్రాజెక్టులు చేపట్టేలా చూడాలని, అందుకు తన ఎగ్జిమ్ బ్యాంక్‌ను ఉపయోగించుకోవాలని కొందరు నిపుణులు సూచించారు. అయితే మన సాయంతో ఆఫ్రికాలో సౌర ఉత్పత్తి జరిపే వారు విధిగా భారతీయ మాడ్యూల్స్‌ను కొనుగోలు చేయాలన్న నిబంధన విధించాల్సి ఉంటుందని వారు తెలిపారు.
పెరుగుతున్న నిల్వలు
డిమాండుకు మించి సౌర మాడ్యూల్స్ ఉత్పత్తి జరుగుతుండటంతో దేశంలో వాటి నిల్వలు పెరిగిపోతున్నాయి. సౌర విద్యుత్‌పై దీని ప్రభావం పడుతుంది. అదనపు విద్యుత్ సమస్య తలెత్తుతుంది. డిమాండ్ తక్కువగా ఉన్న నెలలలో సౌర విద్యుదుత్పత్తిని గ్రిడ్ తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఫలితం గా వేలం వేసిన అనేక గిగావాట్ల ప్రాజెక్టులకు వినియోగదారులే లేకుండా పోతారు. అప్పుడు భారీ స్థాయిలో విద్యుత్‌ను నిల్వ చేసుకోవాల్సి వస్తుంది.
సోలార్ బెంబేలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



