- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో ఈవారం ఎండలు దంచికొడతాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నెల 3 నుంచి 7 వరకు ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు. భద్రాద్రి, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో 39-41°C వరకు ఎండలు నమోదవుతాయని, హైదరాబాద్లో 36-37°C ఉష్ణోగ్రతలు ఉండవచ్చన్నారు. ఇక వేసవి ప్రారంభమైనందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
- Advertisement -



