Sunday, March 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇరాన్ పై అమెరికా,ఇజ్రాయిల్ దాడులు అప్రజాస్వామికం 

ఇరాన్ పై అమెరికా,ఇజ్రాయిల్ దాడులు అప్రజాస్వామికం 

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు టౌన్ 
ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులు, ప్రజాస్వామికమణి, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుందని, ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఆర్.జనార్ధన్ అన్నారు. ఆలేరు పట్టణంలో  ఆదివారం  ఇరాన్ పై అమెరికా,ఇజ్రాయిల్ సాగిస్తున్న హంతక దాడులను ఖండిస్తూ సీపీఐ ఎం.ఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో, నల్లజండాలతో  పట్టణంలో  నిరసన తెలుపుతూ, అమెరికా,ఇజ్రాయిల్ దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు.

ఈ సందర్భంగా జనార్ధన్ మాట్లాడుతూ.. ఒక ప్రక్క చర్చలంటూనే నమ్మక ద్రోహానికి పాల్పడుతూ ఇరాన్,మధ్యప్రాచ్యంలో అగ్నిగుండంగా మార్చుతూ ప్రజలపై,స్కూల్ పిల్లలను టార్గెట్ చేస్తూ హంతక దాడులకు పాల్పడటం అమానవీయ చర్య అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాల అంతర్గత విషయాలలో జోక్యం చేసుకుంటూ, ప్రజలకు తీరని అన్యాయానికి పాల్పడుతుందని, వెనుజూల లో ఆ దేశాధ్యక్షున్ని,అతని భార్యను కిడ్నాఫ్ చేయడం,పాలస్తీనా పై ఇజ్రాయిల్ ద్వారా ఎడతెరిపి లేకుండా దాడులు చేస్తూ ప్రజలను ఊచకోతకోస్తూ రక్తం మరిగిన పులిలా గాండ్రించడం ను ప్రపంచ దేశాలు, ప్రజలు తీవ్ర ప్రమాదంగా చూడాలని,అమెరికా సామ్రాజ్యవాదం ఆయా దేశాలపై సాగిస్తున్న హంతక దాడులకు వ్యతిరేకంగా పోరాడిలని అన్నారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ ఎం.ఎల్ న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి ఇక్కిరి సహదేవ్,ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు పద్మ సుదర్శన్,పీ ఓ డబ్ల్యూ జిల్లా అద్యక్షులు ఆర్.సీత, మందనపల్లి గ్రామ ఉపసర్పంచ్ పద్మ శశిరేఖ, పీ ఓ డబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి మాలోత్ సుగుణ, ఏ ఐ కే ఎం ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు మామిడాల బాల మల్లేష్,మాలోత్ మోతీలాల్,తమ్మడి మాధవి,గడ్డం పద్మ,ఇక్కిరి మాధవి,కొమ్మిడి లత, తమ్మడి రమేష్, కుర్రి మార్కండేయ,గడ్డం సత్తి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -