నవతెలంగాణ – జన్నారం
ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్ గుగ్గులావత్ సంగీతా రవి నాయక్ వైద్య శిబిరం నిర్వాహకులు చిందం చంద్రయ్య అన్నారు. ఆదివారం మండలంలోని తిమ్మాపూర్ గ్రామపంచాయతీలో కరీంనగర్ సన్రైస్ హాస్పిటల్, యజమాని నూతి వెంకటేష్, చందు సహకారంతో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉచిత వైద్య శిబిరంలో గ్రామంలోని ప్రజలకు డాక్టర్ రమణి , డాక్టర్ దేవా శ్రీను ఆధ్వర్యంలో 152 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు గోళీలు అందించడం జరిగిందన్నారు. సమస్య తీవ్రంగా ఉన్న వారిని గుర్తించి కరీంనగర్ ఆసుపత్రికి వస్తే వారికి. ఉచితంగా చికిత్సలు అందిస్తామని తెలిపారు.
కార్యక్రమంలో జన్నారం మండల సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు జాడి గంగాధర్, తిమ్మాపూర్ ఉపసర్పంచి వేముల నాగేష్, డైరెక్టర్ ప్రదీప్ నాయకులు జునుగురి మల్లయ్య, చిందం శ్రీనివాస్, దేవ రాజమౌళి వార్డు సభ్యులు బోర్లకుంట శివశంకర్, చిందం స్వప్న, పెరుగు కృష్ణవేణి, అజ్మీరా దేవిక, డాక్టర్ మల్లేష్ గోవింద నాయక్ , ప్రోగ్రాం మేనేజర్ కొంతం రాజశేఖర్, కోఆర్డినేటర్ సతీష్ తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.



