నవతెలంగాణ-కమ్మర్ పల్లి
ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం మండల కేంద్రంలో నిర్వహించిన ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశంలో ఈ మేరకు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు టియుసిఐ జిల్లా ఉపాధ్యక్షురాలు సత్తెక్క తెలిపారు.
నూతన అధ్యక్షుడిగా రామాంజనేయులు, ప్రధాన కార్యదర్శిగా రాజేందర్, కోశాధికారిగా పోషన్న, ఉపాధ్యక్షుడిగా మౌలానా స్వామి, సహాయ కార్యదర్శిగా శ్రీనివాస్ తోపాటు పలువురుని కార్యవర్గ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తమ వంతు కృషి చేస్తామన్నారు.



