Sunday, March 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎస్పీ వర్గీకరణ పోరాట అమర వీరులకు ఘన నివాళులు

ఎస్పీ వర్గీకరణ పోరాట అమర వీరులకు ఘన నివాళులు

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు టౌన్  
రాజ్యాంగబద్ధంగా అమలవుతున్న ఎస్సీ రిజర్వేషన్లను ఏబిసిడిలుగా వర్గీకరించాలని, వర్గీకరణకు పార్లమెంట్ లో బిల్లు పెట్టి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ పోరాటంలో అమరులైన అమరులకు, ఆదివారం ఆలేరు పట్టణంలో అంబేద్కర్ విగ్రహం వద్ద చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మార్పీఎస్  వీరులైన పొన్నాల సురేంద్ర మాదిగ, దామోదర్ మాదిగ ,మహేష్ మాదిగ, హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముట్టడిలో భాగంగా పోలీస్ లాఠీ చార్జీలో గాయపడి మృతి చెందినభారతి మాదిగ చిత్రపటాలకు పూలమాలవేసి  జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నివాళులర్పించారు.

జిల్లా అధ్యక్షులు నల్ల చంద్ర స్వామి మాట్లాడుతూ ఎస్సీలను ఏబిసిడిలుగా వర్గీకరించాలని, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు  మందకృష్ణ  నాయకత్వంలో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి హయం లో ఎస్సీ వర్గీకరణపై తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా గాంధీభవన్ పై దాడి చేసిన ఘటనలో ప్రమాదవశత్తు కాలి తీవ్ర గాయాలతో మర్చి 1వ తేదీన మరణించడం జరిగిందని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు నల్ల చంద్ర స్వామి, కందుల నర్సింగ్ రావ్, పుల్లూరు రవి, భిక్షపతి, బాలరాజ్, దుర్గ ప్రసాద్,  బాలయ్య, ఎల్లయ్య, దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -