Sunday, March 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెండ్యాల కిషన్ సేవలు స్ఫూర్తిదాయకం

పెండ్యాల కిషన్ సేవలు స్ఫూర్తిదాయకం

- Advertisement -

ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మోహన్ 
నవతెలంగాణ – బాన్సువాడ (నసురుల్లాబాద్)
ఉద్యోగ విరమణ అనివార్యమని, శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలని కామారెడ్డి జిల్లా రోడ్డు భవనాల శాఖ అధికారి సూచించారు. ఆదివారం బాన్సువాడ పట్టణంలో రోడ్డు భవనాల శాఖ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న పెండ్యాల కిషన్ ఆర్ అండ్ బి శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని జిల్లా ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మోహన్ వారి  సిబ్బందితో కలిసి ఘనంగా నిర్వహించారు. పదవి విరమణ కార్యక్రమంలో భాగంగా కిషన్ కు పూలమాలవేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. అలాగే కిషన్ కు ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు.

అనంతరం బాన్సువాడ ఓ కల్యాణ మండపంలో పదవి విరమణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంకు వివిధ శాఖల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మోహన్ మాట్లాడుతూ ఆర్ అండ్ బి శాఖలో 32 సంవత్సరాలు ఎలాంటి అవాంతరాలు లేకుండా, సక్రమంగా విధులు నిర్వహిస్తూ దిగ్విజయంగా పదవి విరమణ పొందారని అన్నారు. ఇటు అధికారులకు, ప్రజలకు కావలసిన సమాచారాన్ని అందిస్తూ ఉత్తమమైన సేవలు అందించారని కొనియాడారు. అలాగే పదవి విరమణ గ్రహీత కిషన్ మాట్లాడుతూ నా పదవి విరమణ సన్మాన సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు,  సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -